ఆంధ్రప్రదేశ్
భూసమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
09-10-2026 10:11

2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూసమస్యలను పరిష్కరించి, ఆంధ్రప్రదేశ్ ను భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో మంత్రి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాసుపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు, విస్తీర్ణం తెలుసుకోవచ్చని తెలిపారు. వీబీ–జీ రామ్‌జీ ద్వారా నియోజకవర్గానికి అదనంగా 25 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు
xPress24, Agiripally, October 9,