xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా

26-09-2026 14:51
అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అందించే ఆర్థిక సాయం కొండంత ధైర్యాన్ని, గొప్ప భరోసాను ఇస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
xPress24, Paravathipuram, September 26, సాలూరు, సెప్టెంబర్ 26: అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అందించే ఆర్థిక సాయం కొండంత ధైర్యాన్ని, గొప్ప భరోసాను ఇస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం 13 మంది లబ్ధిదారులకు రూ.6,85,268 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కొండంత ధైర్యాన్ని, గొప్ప భరోసాను కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స ఖర్చులను భరించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిన ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు తెలిపారు. తమకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

🎥 వీడియో

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.