ఆంధ్రప్రదేశ్
మంగినపూడి బీచ్‌లో స్వచ్ఛత కార్యక్రమం
28-09-2026 14:27

స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు.
xPress24, Machilipatnam, September 28,