xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ

06-10-2026 14:26
మచిలీపట్నం జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ
మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) నూతన సూపరింటెండెంట్‌గా డా. జి. పద్మశ్రీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
xPress24, Machilipatnam, October 6, మచిలీపట్నం, అక్టోబర్ 6: మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) నూతన సూపరింటెండెంట్‌గా డా. జి. పద్మశ్రీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి లభించడంతో ప్రభుత్వం మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఈ సందర్భంగా డా. పద్మశ్రీ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుని, రోగులకు త్వరితగతిన చికిత్స అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధికి వైద్యులు, సిబ్బంది సహకారంతో సమష్టిగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొని నూతన సూపరింటెండెంట్ డా. జి. పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.