తెలంగాణ
మూడు నెలల్లో ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదా
17-10-2026 10:38

మూడు నెలల్లో ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. హైదరాబాదులోని సచివాలయంలో ఉపముఖ్యమంత్రి అధ్యక్షతన రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిపాదిత బిల్లు రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, కమిటీ కూర్పు, న్యాయపరమైన అంశాలు, వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
xPress24, Hyderabad, October 17,