జాతీయం
మంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటన
26-09-2026 15:24

వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన అభివృద్ధి చోదకశక్తిగా నిలవాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. పెట్టుబడిదారులకు వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, ఏపీ కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు
xPress24, Amaravathi, September 26,