జాతీయం
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను కొనియాడిన బండి సంజయ్
07-10-2026 15:12

దేశ సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన సేవా జ్యోతి కార్యక్రమం కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను, 'వికసిత్ భారత్ 2047' సాధన కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రజలంతా గుర్తించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
xPress24, HYDERABAD, October 7,