తెలంగాణ
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై ఖైరతాబాద్‌లో సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ
07-10-2026 15:14

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా ప్రతినిధిగా 25 ఏండ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్‌లో ‘సేవా జ్యోతి యాత్ర’ పేరుతో భారీ బైక్ ర్యాలీ, ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభా వేదికపై ‘సేవా జ్యోతి’ని ప్రతిష్ఠించి మోదీ వర్చువల్ సందేశాన్ని వీక్షించిన అనంతరం, 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధన కోసం నాయకులు, కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.
xPress24, HYDERABAD, October 7,