xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
ఆంధ్రప్రదేశ్

మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన

07-10-2026 14:09
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
xPress24, Vijayawada, October 7, విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలతో పాటు దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు లభించాలని కోరుతూ కనకదుర్గమ్మవారి సన్నిధిలో ఖడ్గమాల అర్చన నిర్వహించారు. దేశ సేవలో మోదీ చేస్తున్న కృషికి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా లింగమనేని రమేశ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు, ఇతర వర్గాలకు ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత లభిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రమేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు. దేశ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న నరేంద్ర మోదీకి మరింత శక్తి సామర్థ్యాలు కలగాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై ఆయన పేరిట ఖడ్గమాల అర్చన నిర్వహించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని రమేశ్ అన్నారు. భారత్ మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భర దేశంగా అభివృద్ధి చెందాలని, వికసిత్ భారత్ సంకల్పం సాకారం కావాలని ఆకాంక్షించారు. ఖడ్గమాల అర్చన ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు రమేశ్ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, ఠాకూర్ అజయ్ వర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు ఎం. రామబ్రహ్మం, పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

🎥 వీడియో

మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.