తెలంగాణ
ముదిమాణిక్యంలో ప్రజా సమస్యలపై మంత్రి పొన్నం సమీక్ష
07-10-2026 15:01

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లోని ముదిమాణిక్యంలో నిర్వహించిన "పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన" కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, పశు వైద్య శిబిరాలను పరిశీలించిన అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన మంత్రి, మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, మెరుగైన విద్య వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 7,