xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

మందేశ్వర స్వామి సన్నిధిలో వరుణ యాగం

06-10-2026 14:30
మందేశ్వర స్వామి సన్నిధిలో వరుణ యాగం
డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలోని నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనైశ్చరస్వామి ప్రతిష్ఠించిన పవిత్ర మందేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం ఆనందంగా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
xPress24, Madhanapalli, October 6, మందపల్లి: డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలోని నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనైశ్చరస్వామి ప్రతిష్ఠించిన పవిత్ర మందేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం ఆనందంగా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అష్టదిక్పాలకుల్లో పశ్చిమ దిక్కుకు అధిపతిగా భావించే వరుణదేవుడి కరుణ కోసం వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ పదివేల సార్లు వేద శ్లోకాలను పఠించడంతో పాటు సహస్ర ఘటాభిషేకం నిర్వహించినట్లు చెప్పారు. పూర్వకాలంలో వర్షాలు కురవక దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు రాజులు, ఋషులు వరుణ యాగాలు నిర్వహించేవారని, యాగ ఫలితంగా వర్షాలు కురిసేవని పేర్కొన్నారు. ఈ వరుణ యాగం ఫలితంగా కోనసీమ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వరుణదేవుడి అనుగ్రహంతో మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.