తెలంగాణ
మునగాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన
07-10-2026 10:05

పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు.
xPress24, munagala, October 7,