తెలంగాణ
మానాలలో రూ.14.20 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
07-10-2026 14:58

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో ప్రజాప్రతినిధులతో కలిసి రూ.14.20 కోట్ల రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ద్వారా మానాలకు తాగు, సాగునీరు అందిస్తామని, పోడు పట్టాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
xPress24, HYDERABAD, October 7,