ఆంధ్రప్రదేశ్
మార్కాపురం మున్సిపాలిటీలో తొలిరోజు నిల్ నామినేషన్లు
16-10-2026 16:39
మార్కాపురం జిల్లాలోని మార్కాపురం మున్సిపాలిటీలో శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
xPress24, Markapuram, October 16,
మార్కాపురం, అక్టోబర్ 16:
మార్కాపురం జిల్లాలోని మార్కాపురం మున్సిపాలిటీలో శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డులకు ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మున్సిపల్ కమిషనర్ డి.వి.ఎస్. నారాయణరావు తెలిపారు.
అయితే, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ద్వారా 118 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గడువును దృష్టిలో ఉంచుకుని, నామినేషన్ దాఖలుకు అవసరమైన అన్ని పత్రాలతో కార్యాలయానికి వచ్చి తమ నామినేషన్లను సమర్పించాలని సూచించారు.
ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.