ఆంధ్రప్రదేశ్
మారిటైమ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
09-10-2026 10:07

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రముఖ మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన గురువారం సమావేశమైయ్యారు.ఈ సందర్భంగా గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్‌బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
xPress24, Amaravati, October 9,