xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
తెలంగాణ

మార్ఫింగ్ వీడియోల ద్వారా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

07-10-2026 11:13
మార్ఫింగ్ వీడియోల ద్వారా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
సోషల్‌ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం జరుగుతోందన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి.
xPress24, Hyderabad, October 7, బీఆర్ఎస్ నాయకుల గత పదేళ్ల అక్రమాస్తులను బయటపెడుతున్నాననే కక్షతోనే తనపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులపై తాను మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను కుట్రపూరితంగా మార్ఫింగ్ చేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌లలో వైరల్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తమ రాజకీయ స్వార్థం కోసం తన వాయిస్‌ను, వీడియోను ట్యాంపరింగ్ చేసి వైరల్ చేస్తున్న వారిపై ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠినమైన పోలీసు కేసులు నమోదు చేయిస్తానని ఎంపీ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా మార్ఫింగ్ వీడియోలతో ప్రజలను మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్న వారి అసలు స్వరూపాన్ని త్వరలోనే బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.