xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్

మూలా నక్షత్రం సందర్భంగా నూజివీడు సరస్వతీ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

16-10-2026 14:17
మూలా నక్షత్రం సందర్భంగా నూజివీడు సరస్వతీ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
xPress24, Nuzividu, October 16, ఏలూరు జిల్లా | అక్టోబర్ 16, 2026 ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దక్షిణాదిలో రెండో బాసరగా పేరుగాంచిన ఈ ఆలయంలో శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు సిద్ధించాలని, అమ్మవారి ఆశీస్సులు లభించాలని తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల సందడి, చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో మార్మోగింది. భక్తుల రాకతో నూజివీడులోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.