జాతీయం
మిషన్ కర్మయోగి ప్రాంతీయ కార్యశాల
29-09-2026 09:55

"మిషన్ కర్మయోగి"లో భాగంగా శిక్షణ సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘సాధన శృంఖల 2026’ పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో మంగళవారం, బుధవారాల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణ సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు.
xPress24, Vijayawada, September 29,