తెలంగాణ
మహబూబ్‌నగర్ పట్ణణంలో మౌలికవసతులకు పెద్దపీట
01-10-2026 10:21

ప్రజలకు భద్రత, మౌలికసౌకర్యాల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నగరంలో 2.50 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 40, 57వ డివిజన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
xPress24, Mahabubnager, September 30,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లోని ప్రతి డివిజన్‌లో సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాత్రివేళల్లో ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Byte :
యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే