xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
తెలంగాణ

మహబూబాబాద్‌లో గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ డాక్టర్ శభరీష్

23-09-2026 14:39
మహబూబాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనాల్లో డీజేల వాడకాన్ని నిషేధించినట్లు ఎస్పీ డాక్టర్ శభరీష్ తెలిపారు. జిల్లాలో 2,380 విగ్రహాలు కొలువుదీరగా, 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాతో పాటు డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
xPress24, MAHABUBABAD, September 23, మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవాల్లో డీజేలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ శభరీష్ ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,380 గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు వెల్లడించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. 500 మందితో పటిష్ట బందోబస్తు.. డ్రోన్లతో నిఘా నిమజ్జనోత్సవాల పర్యవేక్షణ కోసం నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచుతామన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి ఉత్సవాలు సజావుగా సాగేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు, వాలంటీర్లతో పాటు ఫైర్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు ఎస్పీ చెప్పారు. నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. బైట్: డాక్టర్ శభరీష్, జిల్లా ఎస్పీ, మహబూబాబాద్

🎥 వీడియో

మహబూబాబాద్‌లో గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ డాక్టర్ శభరీష్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.