ఆంధ్రప్రదేశ్
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
17-10-2026 10:51

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక దుర్గమ్మ వారు మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలు అందజేస్తారు.
ఇది ఇలా ఉండగా శ్రీశైల మహక్షేత్రంలో దసరా మహోత్సవాలలో భాగంగా భ్రమరాంబికాదేవి అమ్మవారు గత రాత్రి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ రోజు వెన్నముద్దల బతుకమ్మను ఆరాధించనున్నారు.
xPress24, Vijayawada, October 17,