xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు మేళా గొప్ప అవకాశం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

25-09-2026 16:29
మహిళా సాధికారతకు జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026 గొప్ప అవకాశంగా నిలుస్తుందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
xPress24, Vijayawada, September 25, విజయవాడ: మహిళా సాధికారతకు జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026 గొప్ప అవకాశంగా నిలుస్తుందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సాధారణంగా ఢిల్లీలో నిర్వహించే స్థాయి సరస్ మేళాను ఈ ఏడాది విజయవాడలో నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. జాతీయ సరస్ ఆజీవిక మేళా ద్వారా ఇతర రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, మార్కెట్, విక్రయ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. దసరా ఉత్సవాల సమయంలో మేళాను నిర్వహించడం వల్ల విజయవాడలో ఉత్సవ వాతావరణం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారులు తయారు చేస్తున్న నాణ్యమైన ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ను ప్రకటించి ముందుకు తీసుకెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత 35 సంవత్సరాలుగా డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ, స్వయం ఉపాధి, మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి తదితర అంశాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. గ్రామీణ మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు స్థానిక మార్కెట్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, సెర్ప్, పోలీస్, మున్సిపల్, పర్యాటక, వైద్య ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మేళాకు వచ్చే సందర్శకులు, వ్యాపారులు, మహిళా సంఘాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెట్ అందుబాటు, ఉత్పత్తుల ప్రదర్శన, బ్రాండింగ్, ప్రత్యక్ష విక్రయాలు, వ్యాపార అనుసంధానాలు, మహిళా సాధికారత లక్ష్యాలతో జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026ను విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

🎥 వీడియో

మహిళా సాధికారతకు మేళా గొప్ప అవకాశం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.