తెలంగాణ
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం
28-09-2026 17:04

మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ, సమాజ అభివృద్ధికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని అన్నారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు.
xPress24, HYDERABAD, September 28,