క్రీడలు
మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణం
23-09-2026 05:30
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో భాగంగా అతిద్య జట్టు జపాన్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. జపాన్ పై భారత జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
xPress24, Krishna District, September 22,