ఆంధ్రప్రదేశ్
మహిళలను ఆర్థికంగా బలోపేతం
06-10-2026 09:46

స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్, మెప్మా అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళలకు రుణాలు, శిక్షణ, నాణ్యత ప్రమాణాలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.విజయవాడలో ఈనెల 15వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్న ‘నేషనల్ సరస్ మేళా-2026’ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
xPress24, Amaravati, October 6,