xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
ఆంధ్రప్రదేశ్

యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహన

08-10-2026 17:11
యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్‌చెరువులోని వీజేఎస్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు వీధి నాటకం నిర్వహించారు.
xPress24, Rajamahendravaram, October 8, రాజమహేంద్రవరం: యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్‌చెరువులోని వీజేఎస్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు వీధి నాటకం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యాంటీబయోటిక్స్‌ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్‌ వినియోగించరాదని సూచించారు. వైద్యులు సూచించిన మోతాదుతో పాటు, నిర్దేశించిన చికిత్సా కాలాన్ని తప్పనిసరిగా పాటించాలని వివరించారు. యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల సూక్ష్మజీవులు మందులకు లొంగని స్థితి ఏర్పడుతుందని, ఫలితంగా భవిష్యత్తులో సాధారణ వ్యాధులకు సైతం మందులు సమర్థవంతంగా పనిచేయకపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు నాటకం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ ఎన్‌.వి.వి. జగన్మోహన్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ ఎన్‌. శకుంతల, వైస్‌ చైర్‌పర్సన్‌ కె.ఎస్‌. తులసి అపూర్వ, ప్రిన్సిపల్‌ డా. డి. నరేంద్ర, గ్రామ పెద్దలు, స్థానిక మెడికల్‌ షాపుల నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల్లో యాంటీబయోటిక్స్‌ వినియోగంపై అవగాహన పెంచేందుకే ఫార్మసీ విద్యార్థులతో వీధి నాటకాలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్‌ డా. డి. నరేంద్ర తెలిపారు. ఉత్తమ ప్రదర్శనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు.

🎥 వీడియో

యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహన

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.