తెలంగాణ
యువత నైపుణ్యమే తెలంగాణకు అతిపెద్ద బలం: శ్రీధర్‌బాబు
08-10-2026 16:07

యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక, ఆర్థిక సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్‌లో ప్రారంభమైన డీఈ షా వృద్ధి నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపొలిస్‌లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ, రాష్ట్రంలో ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 8,