తెలంగాణ
యువత ప్రతిభే తెలంగాణకు బలం
08-10-2026 09:43

యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్ లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి బుధవారం పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు.ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా.. కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
xPress24, Hyderabad, October 8,