xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
జాతీయం

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోదీ

28-09-2026 10:27
యువత మాదక ద్రవ్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. మక్ కీ బాత్ ద్వారా మోదీ ప్రసంగించారు.
xPress24, Delhi, September 27, మాదక ద్రవ్యాలకు, డగ్స్ కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తూ  దేశ యువత ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్‌లో ప్రసంగించిన మోదీ .. యాంటీ డ్రగ్స్ సందేశాన్ని ఇతరులకు చేరవేసే బాధ్యతను కూడా యువత తీసుకుందన్నారు. నషా ముక్త్ యువత ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం వంద వారాల వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎన్.ఎస్.ఎస్ తో ముడిపడిన మన యువత కూడా ఇందులో భాగమని ప్రధాని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో పాల్గొంటున్నాయని తెలిపారు.  గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలకొలది  సంకల్ప సమావేశాలు, చైతన్య పరిచే కార్యక్రమాలు జరిగాయని మోదీ చెప్పారు. మత్తు రహితంగా ఉండాలనే సందేశం తనకు బాగా నచ్చిందని మోదీ చెప్పారు. మన యువత స్వయంగా తమ భాషలో, తమ పద్ధతిలో ఈ సందేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. వేల కొద్దీ యువత ఈ ఆహ్వానంతో ముందుకు రావడం నాకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. రాబోయే రోజులలో ఈ ఉద్యమంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. త్వరలోనే మనకు అనేక పండుగలు, పర్వదినాలు కూడా రాబోతున్నాయనీ.. ఈసారి పండుగల సంతోషాల మధ్య మనం మన చుట్టుపక్కల కూడా దృష్టిని పెట్టాలన్నారు. ఒకవేళ ఎవరైనా యువకుడు తప్పుడు అలవాట్ల వైపుకి వెళ్తున్నా,.. మత్తు నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నా.. వారికి సహాయం చేయాలని చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే యువత తో కూడిన ...  అభివృధ్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని మనందరమూ ముందుకు తీసుకువెళ్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.

🎥 వీడియో

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోదీ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.