xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
తెలంగాణ

యాసంగిలో పశుగ్రాస కొరత నివారణకు ముందస్తు చర్యలు: తుమ్మల

15-10-2026 09:52
యాసంగిలో పశుగ్రాస కొరత నివారణకు ముందస్తు చర్యలు: తుమ్మల
రానున్న యాసంగిలో వరి సాగు తగ్గనున్నందున పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్‌లో ఎల్ నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్షలో డిజిటల్ వ్యవసాయం, ఏఐ టెక్నాలజీ వినియోగంపై అధికారులతో చర్చించారు.
xPress24, Hyderabad, October 14, రానున్న యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా పశుగ్రాసంగా వినియోగించేలా చూడాలని, అవసరమైతే ఖరీఫ్ పశుగ్రాసాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. పశుగ్రాసం అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. డిజిటల్ వ్యవసాయం, ఏఐ టెక్నాలజీకి ప్రాధాన్యం డిజిటల్ వ్యవసాయంలో ఏఐ, శాటిలైట్ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జర్మనీ ప్రతినిధులతో డిజిటల్ సాంకేతికతపై చర్చలు జరిపినట్లు చెప్పారు. శాటిలైట్ డేటాతో నేలలోని పోషకాల లభ్యతను అంచనా వేసి, ఒకేసారి 70 లక్షల మంది రైతులకు మట్టి పోషకాలపై సమాచారం అందించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రతి 12 రోజులకు ఎరువుల వినియోగంపై సమగ్ర సమాచారం అందించే అవకాశం ఉందని, అధిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. సాగు ఖర్చుల తగ్గింపునకు చర్యలు కొత్త సాంకేతికతల కచ్చితత్వాన్ని పరిశీలించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. నేల ఆరోగ్య పరిరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపునకు డిజిటల్ వ్యవసాయం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, యాంత్రీకరణ, గోదాముల నిర్మాణాలపై చర్చించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.