xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

రూ.90 లక్షల సాస్కి నిధులతో ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

06-10-2026 14:26
రూ.90 లక్షల సాస్కి నిధులతో ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పాత ఉపకాలిలో సంగమేశ్వరం–పాత ఉపకాలి ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.90 లక్షల సాస్కి నిధులు మంజూరయ్యాయి.
xPress24, Nagayalanka, October 6, నాగాయలంక, అక్టోబర్ 6: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పాత ఉపకాలిలో సంగమేశ్వరం–పాత ఉపకాలి ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.90 లక్షల సాస్కి నిధులు మంజూరయ్యాయి. ఈ రహదారి నిర్మాణ పనులకు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోతున్న అంశంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. తీర గ్రామాల్లో రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు కోరిన ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులతో రెండు వంతెనలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కృషితో గ్రామాల అభివృద్ధికి మరిన్ని బాటలు పడుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. పల్లె పండుగ–1 కార్యక్రమంలో భాగంగా పాత ఉపకాలి గ్రామంలో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. నాగాయలంక మండలంలో రూ.6.75 కోట్లతో 73 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అలాగే మండలంలో రూ.45 లక్షలతో నాలుగు అసంపూర్తిగా ఉన్న గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ధరించిన జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ బాలశౌరి వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.