xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యతగా అలవర్చుకోవాలి

01-10-2026 16:35
రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యతగా అలవర్చుకోవాలి
ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంలో రక్తదానం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు.
xPress24, Kakinada, October 1, కాకినాడ: ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంలో రక్తదానం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక పి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, రాష్ట్ర ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వై.డి. రామారావు, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ అనంత కుమార్ తదితరులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించిన ఆయన, రక్తదానం చేస్తున్న విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అవయవదానం ఎంతటి గొప్పదో రక్తదానం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. జాతీయ స్థాయిలో విశేష సేవలందిస్తున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ శాఖ ద్వారా అద్భుతమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. నిత్యం ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన వారు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులు రక్తం కోసం ఎదురుచూస్తుంటారని, వారి అవసరాలను తీర్చడంలో రెడ్‌క్రాస్ సంస్థ పాత్ర ప్రశంసనీయమన్నారు. ఉత్తమ సేవలందిస్తున్న కాకినాడ చాప్టర్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. యువత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా యువతీ, యువకులు పౌష్టికాహారం తీసుకుంటూ రక్తహీనతకు దూరంగా ఉండాలని, జంక్‌ఫుడ్‌కు స్వస్తి పలకాలని సూచించారు. యువకులు మత్తు పదార్థాలు, మద్యపానం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ప్రమాదాల బారినపడే అవకాశాలు పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటం కష్టమవుతుందని, రక్తదానం చేసే అవకాశాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వైద్యుల సూచనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థి దశ నుంచే సేవా గుణాన్ని అలవర్చుకుని, రెడ్‌క్రాస్ వాలంటీర్లుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వై.డి. రామారావు మాట్లాడుతూ రక్తదాన ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సంస్థల్లో రెడ్‌క్రాస్ కీలకమైన సంస్థగా సేవలందిస్తోందన్నారు. రాష్ట్రంలో 20 బ్లడ్ బ్యాంకుల ద్వారా ఏటా సుమారు లక్ష యూనిట్ల రక్తాన్ని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి మంగళవారం ఉచితంగా రక్త మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. రక్తాన్ని కొనుగోలు చేసే పరిస్థితి నుంచి స్వచ్ఛంద రక్తదాన సంస్కృతివైపు సమాజం పయనించాల్సిన అవసరం ఉందన్నారు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ రంగంలో విశేష సేవలందించిన జైగోపాల్ జాలీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రామారావు తెలిపారు. యువత చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ అనంత కుమార్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటివరకు సుమారు ఆరు లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదానంపై కొందరిలో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తాము కూడా ప్రతి ఏటా రక్తదానం చేస్తున్నామని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ తోటి వారి ప్రాణాలను కాపాడటంలో భాగస్వాములు కావాలని కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.