xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
జాతీయం

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు... సెప్టెంబర్‌లో రూ.2.03 లక్షల కోట్లు

02-10-2026 09:38
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు... సెప్టెంబర్‌లో రూ.2.03 లక్షల కోట్లు
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో రూ.2.03 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14.7 శాతం వృద్ధి నమోదైంది.
xPress24, Delhi, October 1, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అద్దం పడుతూ జీఎస్టీ వసూళ్లు గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2.03 లక్షల కోట్లను దాటాయని కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 14.7 శాతం అధికం. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే పన్ను వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల ద్వారా వచ్చే స్థూల ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.65,525 కోట్లుగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన రీఫండ్‌లు 3 శాతం తగ్గి రూ.27,001 కోట్లకు చేరగా, రీఫండ్‌ల తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 18.1 శాతం పెరిగి రూ.1.76 లక్షల కోట్లుగా నిలిచాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్ - సెప్టెంబర్) మొత్తం జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం వృద్ధితో రూ.12.46 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణలో దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు జాతీయ సగటు వృద్ధి రేటును వెనక్కి నెట్టి తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఏకంగా 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సర్దుబాటు తర్వాత ఎస్‌జీఎస్‌టీ రూపంలో రూ.22,231 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ జీఎస్టీ వసూళ్లు స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో 6 శాతం వృద్ధితో రూ.3,599 కోట్లు రాగా, ప్రథమార్థంలో సెటిల్‌మెంట్‌ తర్వాత 18 శాతం వృద్ధితో రూ.19,598 కోట్ల వసూళ్లను సాధించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.