జాతీయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
28-09-2026 10:40

స్వయం సమృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్త సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా, మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో యుద్ధ రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకే నేటి అవసరాలకే కాక, రాబోయే సవాళ్లను సైతం ఎదుర్కొనేలా భారత రక్షణ వ్యూహాలను తీర్చిదిద్దుతున్నట్లు అమిత్ షా వివరించారు.
xPress24, Krishna District, September 27,