ఆంధ్రప్రదేశ్
రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
17-10-2026 10:43

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ప్రత్యేక అధికారులను నియమించడంతోపాటు, 11 కీలక అంశాలపై పర్యవేక్షణ కోసం ఈ కమిటీలను వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ విష్ణువర్దన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించడం, చికిత్స సమయంలో పొరపాట్లు, నివారించదగిన ప్రమాదాలను తగ్గించడం, రోగుల భద్రతలో కీలకమని వెల్లడించింది.
xPress24, Amaravathi, October 17,