క్రీడలు
రజత పతకం - రాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందనలు
23-09-2026 05:30
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్ట్రపతి.. ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ... భవిష్యత్‌లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు.
xPress24, Krishna District, September 20,