జాతీయం
రాజ్‌నాథ్ సింగ్
26-09-2026 10:20

ఫస్ట్ అసెంట్ మౌంటెనీరింగ్ ఎక్స్‌పెడిషన్ బృందాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఈరోజు అభినందించారు. ఈ యాత్ర బృంందం లడఖ్‌లో కేవలం 23 రోజుల్లో 6 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న, ఇంతవరకు ఎవరూ అధిరోహించని 20 శిఖరాలను అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్.. ఈ యాత్ర భారతదేశపు పర్వతారోహణ నైపుణ్యానికి, సాహస క్రీడలలో దాని నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన అధిరోహణలు కొత్త ప్రమాణాలను నెలకొల్పాయని, దేశవ్యాప్తంగా ఉన్న యువ పర్వతారోహకులను ప్రోత్సహించి, దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
xPress24, Krishna District, September 25,