తెలంగాణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 17:03

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. వేములవాడ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వవిప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
xPress24, HYDERABAD, October 2,