తెలంగాణ
రాజ్యాంగ సంస్థలపై రాహుల్ గాంధీ తీరును విమర్శించిన కిషన్ రెడ్డి
09-10-2026 16:54

కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పులు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్లు ప్రచారం చేయడం, ఓడిపోయినప్పుడు రాజ్యాంగ సంస్థలపై అబద్ధాలు ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సీఏజీ, సైన్యం, విద్యాసంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తించడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. వరుస ఓటములను తట్టుకోలేక అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలు మాని, ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
xPress24, HYDERABAD, October 9,