xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
అంతర్జాతీయం

రెడ్ రిబ్బన్ 5కే మారథాన్ నిర్వహణ

01-10-2026 10:13
రెడ్ రిబ్బన్ 5కే మారథాన్ నిర్వహణ
ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్–2026లో భాగంగా “Run for a Healthier, HIV-Free Tomorrow” అనే సందేశంతో రెడ్ రిబ్బన్ 5కే మారథాన్‌ను బుధవారం నిర్వహించారు.
xPress24, Paderu, September 30, పాడేరు, సెప్టెంబర్ 30: ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్–2026లో భాగంగా “Run for a Healthier, HIV-Free Tomorrow” అనే సందేశంతో రెడ్ రిబ్బన్ 5కే మారథాన్‌ను బుధవారం నిర్వహించారు. యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణ, హెచ్‌ఐవీ పరీక్షల ప్రాధాన్యత, బాధితుల పట్ల వివక్ష నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. 17 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకులు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ అవగాహన పరుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ప్రారంభమైన 5కే మారథాన్‌ హుకుంపేట మండలం బర్మంగూడ గ్రామం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా “KNOW • CARE • ACT” అనే సందేశంతో యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణపై అవగాహన కల్పించారు. సురక్షిత పద్ధతులను పాటించడం, ప్రమాదకర ప్రవర్తనకు దూరంగా ఉండటం, హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం, సూదులు, సిరంజీలను పరస్పరం పంచుకోకపోవడం వంటి అంశాలను వివరించారు. అలాగే హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సహకారం, మద్దతు అందించాలని సూచించారు. యువతలో హెచ్‌ఐవీపై అపోహలను తొలగించి, నివారణ చర్యలు, పరీక్షల ప్రాధాన్యతపై అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.