ఆంధ్రప్రదేశ్
రెండవ విడత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు
02-10-2026 09:50

డిఎస్సి రెండవ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా 'మిషన్ మార్చ్' కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడి మానిన పిల్లలు భవిష్యత్తులో మాదకద్రవ్యాల బారిన పడటం, అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్నవిషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు.
xPress24, Undavalli, October 2,