xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్లలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభం

09-10-2026 14:51
రైతు బజార్లలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు.
xPress24, Nellore, October 9, నెల్లూరు జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్‌పేట రైతు బజారులో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యం కిలో ధర రూ.72 నుంచి రూ.75 వరకు ఉందని తెలిపారు. పేద, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రైతు బజార్లలో అందుబాటులో ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.