ఆంధ్రప్రదేశ్
రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
06-10-2026 14:24
వేమూరు నియోజకవర్గంలోని చావలి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
xPress24, Bapatla, October 6,
బాపట్ల జిల్లా, అక్టోబర్ 6:
వేమూరు నియోజకవర్గంలోని చావలి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చావలి, అబ్బనగుడవల్లి, చదలవాడ గ్రామాలకు చెందిన
2,691 మంది అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను
ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రక్రియ ద్వారా రైతుల భూ హక్కులను మరింత స్పష్టంగా, పారదర్శకంగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
“మీ భూమి – మీ హక్కు”
అనే లక్ష్యంతో రైతుల భూ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతుల భూమిపై హక్కుకు అధికారిక ధ్రువీకరణగా ఉపయోగపడతాయని తెలిపారు.
అలాగే భవిష్యత్తులో భూమికి సంబంధించిన వివిధ అవసరాలతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రుణ సదుపాయాలు పొందేందుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.