తెలంగాణ
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
24-09-2026 09:59
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.
xPress24, Hyderabad, September 24,
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటడంతో.. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. వర్షాలతో పాటు గంటకు 45-55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.