xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
తెలంగాణ

రేపు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్..17న తుది ఫలితాలు

09-10-2026 09:38
తెలంగాణ ఆర్టీసీలో సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల వేళ.....భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం రీజియన్ పరిధిలోని 1,791 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
xPress24, Bhadradri-Kothagudem, October 8, తెలంగాణ ఆర్టీసీలో సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల వేళ.....భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం రీజియన్ పరిధిలోని 1,791 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 సంఘాలు బరిలో నిలిచినా... ప్రధానంగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ - టీడబ్ల్యూయూ కూటమికి, ఎంప్లాయూస్ యూనియన్ - నేషనల్ మజ్దూర్‌ యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ రసవత్తరంగా మారింది. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో... కార్మిక సంఘాల నేతలు డిపోల వారీగా, కార్మికుల నివాసాలకు వెళ్లి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. కార్మికులు రాష్ట్ర స్థాయికి తెలుపు, రీజియన్ స్థాయికి లేత ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతనాల సవరణ, పని ఒత్తిడి తగ్గింపు వంటి కీలక డిమాండ్లతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, పోలింగ్ ముగిసినా ఈనెల 17నే తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తమను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీయర్ బాబు ఈ సందర్భంగా కార్మికులను కోరారు. బైట్.. జీయర్ బాబు, తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి

🎥 వీడియో

రేపు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్..17న తుది ఫలితాలు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.