ఆంధ్రప్రదేశ్
రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
01-10-2026 14:09

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో పాల్గొని, వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
xPress24, Repalle, October 1,