xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
తెలంగాణ

రోబోటిక్ సర్జరీలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగడం ఖాయం: కేంద్ర మంత్రి జేపీ నడ్డా

03-10-2026 14:12
రోబోటిక్ సర్జరీలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగడం ఖాయం: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
న్యూఢిల్లీలో జరుగుతున్న సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ (SRS ఇండియా-2026) అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రసంగించారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలతో పాటు సర్జికల్ రోబోటిక్స్‌లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ఆయన తెలిపారు.
xPress24, Delhi, October 3, న్యూఢిల్లీ వేదికగా అక్టోబర్‌ 2 నుంచి 4 వరకు జరుగుతున్న సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ (SRS ఇండియా-2026) అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ఆయన, రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీ రంగంలో భారత్ అత్యంత కీలకమైన దేశంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్‌‌తో పాటు సర్జికల్ రోబోటిక్స్ సేవల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ఇప్పటికే రోబోటిక్ సర్జరీకి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని చెప్పారు. పెరుగుతున్న రోబోటిక్ సర్జరీల సంఖ్య దేశంలో రోబోటిక్ సర్జరీల వినియోగం గణనీయంగా పెరుగుతోందని జేపీ నడ్డా వెల్లడించారు. 2021లో కేవలం 2 వేల 257గా ఉన్న రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీలు.. 2025 నాటికి ఏకంగా 10 వేల 937కు పెరిగాయని తెలిపారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఈ సర్జరీల సంఖ్య 8 వేల 912 నుంచి 44 వేల 857కు భారీగా వృద్ధి చెందిందని వివరించారు. ఇదే జోరు కొనసాగితే 2030 నాటికి రోబోటిక్ సర్జరీ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా (గ్లోబల్ లీడర్) ఎదగగలదని వైద్య నిపుణులు గట్టిగా అంచనా వేస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.