xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
జాతీయం

రామ మందిర నిర్మాణంలో అశోక్ సింఘాల్ పాత్ర గొప్పది: ప్రధాని నరేంద్ర మోదీ

28-09-2026 10:28
రామ మందిర నిర్మాణంలో విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక చైర్మన్ అశోక్ సింఘాల్ పాత్ర మరువలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ఈరోజు ప్రసంగించారు.
xPress24, Delhi, September 27, అయోధ్యలో ఈరోజు మనం రామమందిరాన్ని చూడగలుగుతున్నామంటే దానికి కారణం విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక చైర్మన్ అశోక్ సింఘల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెప్టెంబర్ 27న అతని శత జయంతి అని తెలిపారు. మన్ కీ బాత్ ద్వారా ప్రసంగించిన ప్రధాని సంస్కృతి, సమాజం, రాష్ట్రం కోసం అశోక్ తన యావత్ జీవితాన్నీ పణంగా పెట్టేసారని ప్రధాని తెలిపారు. 1926, సెప్టెంబర్ 27న ఆగ్రాలో జన్మించిన అశోక్ సింఘాల్.. సమాజంలోనే ఉంటూ సన్యాస జీవితాన్ని జీవించారని అన్నారు.  రామజన్మ భూమి ఉద్యమానికి ఆయన ఏ శక్తి అయితే అందించారో, ఏ దారి అయితే చూపించారో .... వాటి ఫలితం గానే  నేడు మనం అయోధ్యలో దివ్యమైన రామాలయాన్ని సాక్షాత్తూ చూడగలుగుతున్నామని కొనియాడారు. ఆయన జీవితాన్ని దగ్గర నుంచి చూడగలగడం నాకు లభించిన అతి పెద్ద అదృష్టమనీ.. అంతేకాక ఈ ఉద్యమంలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం కూడా లభించిందన్నారు. రామాలయ ఉద్యమంతో పాటూ ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద యుద్ధమే చేశారన్నారు. అశోక్ సింఘాల్ ఒక అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించారని.. ఆయన తండ్రి ఒక సివిల్ సర్వీస్ అధికారి అని తెలిపారు. అశోక్ సింఘాల్ స్వయంగా ఐఐటి, బీహెచ్‌యూ నుండి గ్రేడ్యుయేషన్ చేసారనీ... అయినప్పటికీ ఆయన సమాజం కోసం, సంస్కృతి కోసం తన జీవితాన్ని సమర్పించారని గుర్తుచేసుకున్నారు. ఇదే గొప్ప వ్యక్తుల తాలుకు గుర్తింపు అవుతుందని ప్రధాని అన్నారు.  అశోక్ శత జయంతి సందర్భంగా, ఆయనకున్న కోట్లాది మంది  ప్రసంసకుల తరఫున నమస్కరిస్తూ.. నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

🎥 వీడియో

రామ మందిర నిర్మాణంలో అశోక్ సింఘాల్ పాత్ర గొప్పది: ప్రధాని నరేంద్ర మోదీ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.