xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

రామభద్రస్వామి ఆలయంలో ఘనంగా వరుణ యాగం

06-10-2026 14:25
రామభద్రస్వామి ఆలయంలో ఘనంగా వరుణ యాగం
పెనుకొండలోని శ్రీ రామభద్రస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో పూజారులు, రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
xPress24, Penugonda, October 6, పెనుకొండ: పెనుకొండలోని శ్రీ రామభద్రస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో పూజారులు, రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ పూజారులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు, సంకల్పం మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, పరిరక్షణతో పాటు అర్చకుల సంక్షేమం, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతు సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రైతులకు ఆర్థిక సహాయం, వివిధ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తున్న ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులు, నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పంటలకు అవసరమైన సాగునీరు సమృద్ధిగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పెనుకొండ రామభద్రస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.