జాతీయం
రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు -అమిత్ షా
28-09-2026 10:45

అహ్మదాబాద్‌లోని సాబర్మతిలో 1,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ (ద్రవీకృత సహజ వాయువు) ఆధారిత రైలును ఈరోజు సాబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్‌లో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
xPress24, Krishna District, September 27,